
ధైర్యసాహసాలకు, కార్యదక్షతకు ప్రతీకగా నిలిచీ, ఉన్నతాశయంతో సర్థార్ గౌతు లచ్చన నడయాడిన తీరు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబిచ్చారు. ఏలూరు 2వ డివిజన్‌లోని గౌతు లచ్చన్న స్మారక భవనంలో సర్థార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులుగా, మంత్రిగా అంతకు మించి మహోన్నత వ్యక్తిగా గౌతు లచ్చన్న ఎదిగిన తీరు ఆదర్శనీయమని కొనియాడారు. దానికి గుర్తుగానే ప్రజలందరూ ఆయన్ని సర్థార్ అని గౌరవంగా పిలుచుకుంటే,,, నేడు సర్థార్ గౌతు లచ్చన్న జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆయన చేసిన త్యాగాలకు సరైన గుర్తింపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిందనీ, ఇదేతరుణంలో ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకెళ్ళాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంఖ బాలయోగి, పుప్పా రాంబాబు, సింగవరపు ప్రసాద్, తీయాల రవి, లొట్టి రమేష్, నొడగాని సురేష్, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.