ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు.





ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు..

* చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రేమాలయం లో అన్నదానం కార్యక్రమం..

* ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు, ఆగస్టు 16 :- స్ఫూర్తివంతమైన సేవల్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్ళడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న సేవావారోత్సవాల్లో భాగంగా ఏలూరు మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా ప్రేమాలయంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడుతో కలసి వృద్ధులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆగష్ట్‌ 22వ తేదీన జరగనున్న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను వారంరోజుల పాటూ నిర్వహించాలనే ఆలోచన చేయడంతో పాటూ అవసరార్థులకు సాయమందించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మెగా అభిమానులు ఎప్పుడు ముందుంటారని ప్రశంసించారు.. ఏలూరులో చిరంజీవి యువత తలపెట్టిన వారోత్సవాల్లో భాగంగా ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టిన మారం అనుగారికి వారి టీం కు అభినందనలు తెలిపారు.. చిరంజీవి గారినే స్ఫూర్తిగా తీసుకున్న చిరంజీవి యువత, మెగా అభిమానులు ఏలూరులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులను అభినందించారు.. ఏలూరులో వారం రోజులు పాటు పలు సేవా కార్యక్రమాలు, నిర్వహించాలన్న ఆలోచనతోనే నిన్నటి రోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని , ఈరోజున ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. సినీ రంగంలో మొదట సేవా భావాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి చిరంజీవి గారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అభిమానులు కూడా నిత్యం ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.. అదే భావాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో, సేవా రంగంలో అభివృద్ధి చెందాలని, అటువంటి సంస్కృతిని అలవాటు చేసిన మెగా హీరోలకు కృతజ్ఞతలు, పలు రకాల సేవా కార్యక్రమాలను చేస్తున్న మెగా అభిమానులకు అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, జనసేన నాయకులు, ఎన్‌ గ్రూప్స్‌ అధినేత నారా శేషు, కో - ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు మారం అను, అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణ, సభ్యులు పి.జగన్‌, సురేష్‌ మాస్టర్‌, ఇ. పవన్‌, దేవరపల్లి పెదబాబు, కట్టా ఆది, కోమాకుల శీను (పూల శ్రీను) , శానం ఉదయ్ సాయి, దేవా బత్తుల అరవింద్‌, పండు నాయుడు, తుంపాల ఫణి , రామిశెట్టి కళ్యాణ్, జనసేన నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post