చినదొడ్డిగల్లు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాల స్వాధీనం - ఒకరి అరెస్ట్.
అనకాపల్లి నక్కపల్లి, జనవరి 21:
నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చినదొడ్డిగల్లు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళి గారి పర్యవేక్షణలో బుధవారం ఉదయం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నక్కపల్లి ఎస్సై మల్లేశ్వరరావు మరియు వారి సిబ్బంది చినదొడ్డిగల్లు గ్రామంలోని ఒక పాన్ షాపుపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 161 మద్యం మరియు బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ మద్యం నిల్వలకు సంబంధించి గ్రామానికి చెందిన కె.రామకృష్ణ (40 ఏళ్లు) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
మండలంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం విక్రయించినా లేదా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.హెచ్.ఓ మురళి గారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
