అల్టిమేట్ ఫిట్నెస్ జోన్ సెంటర్ ను ప్రారంభించినఏలూరు MLA బడేటి చంటి.
ఏలూరు గడియార స్తంభం సెంటర్ కత్తేపు వారి వీధిలో అల్టిమేట్ ఫిట్నెస్ జోన్ సెంటర్ ను ఆదివారం ఘనంగా MLA బడేటి చంటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు.
ముందుగా ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి జిమ్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నాగరాజు వారి ఆధ్వర్యంలో జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విధంగా చేయడం అభినందించదగ్గ విషయం అని అన్నారు.
ఏలూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యం గా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టిడిపి నగర్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం, మాజీ ఏఎంసి చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు, ట్రైనర్లు పి ఆనంద్, బి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
.jpeg)