శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.



 శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
‎ఏలూరు, ఆగస్టు 16 : ఏలూరు పట్టణం ఏటిగట్టులోని యాదవ సంఘం భవన్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు పాల్గొన్నారు. యాదవ సంఘం సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణునికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందరికి సౌభాగ్యం, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని కోరుకుంటూ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు తీసుకోని శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. చిన్నారులు, మహిళలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కృష్ణాష్టమి అంటే తనకు ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేవాడినని, ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో అందరూ ఆనందంగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

Post a Comment

Previous Post Next Post