అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.
తిరువన్నమలై, ఆగస్టు 24:- ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ఆదివారం తమిళనాడు లోని తిరువన్నమలై లో స్వయంభు వెలసిన శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తుందని, ఆ స్వామి వారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

