ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.






 ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..


* అమరవీరుల త్యాగ ఫలం, ఆంగ్లేయుల పాలన పై తిరుగులేని విజయమే స్వాతంత్ర్య దినోత్సవం..


* ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వెల్లడి..

ఏలూరు, ఆగస్టు 15:- అమరవీరుల త్యాగ ఫలం, ఆంగ్లేయుల పాలన పై తిరుగులేని విజయమే మనకు స్వాతంత్ర్య దినోత్సవం అని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు కొనియాడారు.. శుక్రవారం స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్ గారితో కలిసి రెడ్డి అప్పల నాయుడు గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించి,జాతీయ గీతాలాపన చేసి, జెండా వందనం చేశారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల పురస్కరించుకొని 79వ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం అనేది భారతీయులందరి పండగ మరియు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారత ప్రజలందరూ విముక్తి పొందిన రోజు.. ఈరోజు కోసం దాదాపు 200 సంవత్సరాల నుండి అనేక లక్షల మంది మహాత్ములు ప్రాణ త్యాగం చేసి చాలామంది  మహాత్ములు శాంతియుత మార్గంలో ప్రజలందరినీ ముందుకు నడిపించి తెచ్చిన స్వాతంత్రం.. మనందరికీ కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి విద్యలో గాని, వైద్యంలో గాని, మనం అభివృద్ధి చెందడానికి మనకి కావాల్సిన ఆహారం సమకూర్చుకోవడానికి వారి త్యాగాల ఫలమే ఈ స్వతంత్ర దినోత్సవం అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. భారత దేశంలో ఉన్న ప్రజానీకం అందరికి కూడా అన్ని సౌకర్యాలు అందాలన్న లక్ష్యంతోనే జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించిందని అన్నారు.. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దిశగా ముందుకు తీసుకువెళ్లి ప్రజలందరూ కూడా ఒక ఐక్యత భావంతో, ఒక దేశ రాజ్యాంగం అందించిన ఓటు హక్కు ఏదైతే ఉందో దానిని చైతన్యపరిచి, రాబోయే రోజుల్లో నిజమైన స్వాతంత్రాన్ని భారత పౌరులందరికీ అందించాలని, ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి  అందేలా చేయాలని జనసేన పార్టీ నుంచి అందరు కూడా సంసిద్ధం అవ్వాలని మన యొక్క పూర్వీకులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, మహిళ సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. భారతదేశ ప్రభుత్వం జెండా ఆవిష్కరణ ఉత్సవాలను 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో వారి ఇళ్ళలో శిధిలమైన జాతీయ పతాకాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని భారత ప్రభుత్వం హార్ ఘర్ తిరంగా మహోత్సవం అనే నిర్ణయాన్ని తీసుకుంది.. గత కొన్ని రోజులుగా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈరోజున ఉన్న రాజకీయ వ్యవస్థ లో పెనుమార్పులు తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం.. భారతీయులంతా సమిష్టిగా అభివృద్ధి లో భాగస్వాములు కావాలి.. పార్టీలకు, మతాలకు అతీతంగా ఉండాలి.. ప్రాంతీయ తత్వాలు ప్రక్కన పెట్టాలి.. ఈరోజు మనం పోరాడుతున్నామంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసి రక్తం చిందిస్తే ఈ 79 వసంతాలు పూర్తి చేసుకుని దేశం అభివృద్ధి లో ముందుకు నడుస్తున్నాం అన్నారు.. దేశం అభివృద్ధి కోసం పవన్ తో కలిసి పనిచేయాలి.. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనలతో పార్టీని స్థాపించారు.. ఏలూరు నియోజకవర్గం లో ఉన్న వ్యవస్థలకు భిన్నంగా ఒక మంచి ఆలోచన తో నీతి నిజాయితీ మార్గంలో, అభివృద్ధి లో అన్ని రంగాల్లో ప్రజలకు మౌలికంగా కావలసిన వసతులు కానీ, ఉపాధి కేంద్రాలు కానీ, ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల మనోభావాలను కాపాడుతామని, శ్రామిక వర్గం రైతాంగం అలాగే మహిళ సోదరి మణులకు రక్షణగా ఉంటామని, 79 వసంతాలు అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి..  రాబోయే తరానికి మంచి సమాజాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.. భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆలోచనలను ఆంధ్ర రాష్ట్రం లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, సరిది రాజేష్, నగిరెడ్డి కాశీ నరేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, పైడి లక్ష్మణరావు, పల్లి విజయ్, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, చిత్తిరి శివ, బుధ్ధా నాగేశ్వరరావు, రావూరి దుర్గా మోహన్, లక్కింశెట్టి కిరణ్, ముత్యాల కొండబాబు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, గిడుతూరి పద్మ, తుమ్మపాల ఉమా దుర్గా, కొసనం ప్రమీల, కూన అనసూయ, యడ్లపల్లి మమతా, తోట పుష్ప మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

Previous Post Next Post