ఏలూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం








 

ఏలూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి అమల్లోకి తీసుకువచ్చిన "స్త్రీ శక్తి" పథకంలో భాగంగా శుక్రవారం ఏలూరు బస్ డిపో వద్ద జిల్లా స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది..

ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్ధసారధి గారు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, కైకలూరు ఎమ్మెల్యే శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, ఉంగుటూరు MLA శ్రీ పత్సమట్ల ధర్మరాజు గార్లతో కలిసి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై  జెండా ఊపి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అప్కాబ్ చైర్మన్, జిల్లా మరియు ఏలూరు నియోజకవర్గ స్థాయి  NDA కూటమి పార్టీల నేతలు, డిపో మేనేజర్, RTC అధికారులు, మండల, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు.. అప్పలనాయుడు తెలిపారు..  ఈ పథకం అమల్లో ఎటువంటి లోటుపాట్లు విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగిందన్నారు.. వారి ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం జనవరి నెలలోనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు.. ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.. ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.. కూటమి  ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకానికి మహిళలు మొగ్గు చూపారన్నారు.. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు జోనల్ చైర్మన్ తెలిపారు.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్, లో ఈ పథకం అమల్లో ఉంటుందని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు స్పష్టం చేశారు..

Post a Comment

Previous Post Next Post