ఏలూరులో మోడీ, ట్రంప్ ల దిష్టిబొమ్మల దగ్ధం.

 


స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం..

 కార్పొరేట్ కంపెనీలు లూటీ నుండి దేశాన్ని కాపాడండి..

ఏలూరులో మోడీ, ట్రంప్ ల దిష్టిబొమ్మల దగ్ధం.

 రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్స్ నిరసన.

ఏలూరు, ఆగస్టు 13

 కేంద్ర మోడీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్చా వాణిజ్య  ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల, రైతు కూలి సంఘాల , వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు క్విట్ కార్పోరేట్స్ నిరసన కార్యక్రమాన్ని ఏలూరులో పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు,కార్మికులు,రైతు కూలీలు,వ్యవసాయ కార్మికులు చేపట్టారు.

  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  కె.శ్రీనివాస్, బి కే యం యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు, ఐ ఎఫ్ టి యు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు, రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా, అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కే  గౌస్, సిఐటియు  జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. 

  ట్రంప్, మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించారు.స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల వలన భారత వ్యవసాయ రంగానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు. గతంలో గాట్, డంకెల్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు వలె ఈ ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరతాయన్నారు. యంత్రాలు అమ్ముకోవటానికి, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవటానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడతాయని అన్నారు. 10 సంవత్సరాల నాటి ట్రాక్టర్ లను రద్దు చేయాలని, వాటి స్థానంలో కొత్త ట్రాక్టర్ లు కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమని విమర్శించారు. వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయంకు, రైతులకు వినాశకరంగా ఉండకూడదని హితవు పలికారు. వ్యవసాయన్ని నాశనం చేసి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలు తగదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు వలన ఆక్వా రంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేలా బహుళ జాతి సంస్థలకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగి వ్యవహరించడం తగదన్నారు. ట్రంప్ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులకు,  వ్యవసాయ కార్మికులకు రుణాలు రద్దు చేయాలని కోరారు. కార్మికులకు నష్టం చేకూర్చే కార్మిక చట్టాలు మార్పును మోడీ ప్రభుత్వం విరమించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షించాలని కోరారు.క్విట్ కార్పొరేట్ నిరసన  సందర్భంగా మోడీ, ట్రంప్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు మరియు రైతుకూలీ సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు కట్టా భాస్కర రావు, కోన శ్రీనివాసరావు, ముప్పిడి రాజరత్నం, ఎం రవి, పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, గడసాల రాంబాబు, ముంగం అప్పారావు, ఎస్.కె. మున్ని, ఎస్ జోగయ్య, డి లక్షణామూర్తి, కడుపు కన్నయ్య, చల్లా శ్రీను, నౌడు నెహ్రూ బాబు, గౌడ్ రంగబాబు, ఎస్వి సుబ్బారావు, సుబ్రహ్మణ్య శర్మ, ఎస్ బాబు ప్రసాద్, చంద్రశేఖర్, బి వర్మ, పంపన రవికుమార్, దొంత కృష్ణ, టి ప్రసాద్ రావు, వివిఎన్ ప్రసాద్, నారపల్లి రమణారావు, కోటేశ్వరరావు, వెజ్జు. శ్రీరామచంద్రమూర్తి, సవలం రాంబాబు, దాడి రాముడు, టి విజయలక్ష్మి, బుగ్గల ప్రభాకర రావు, బి రాము, డి నూకరాజు, ఎస్ శ్రీనివాస్, ఎస్ సాయి, డి ఈశ్వర్,, నారాయణ, దుర్గారావు, ఎం సాయి, లోట్ల రమణ, నూకరాజు, ఏవి రమణ, బి మురళి, ఎం శ్యామలరావు, ఈశ్వరరావు, ఆర్ సూరిబాబు, బి బుజ్జి, ఎం శివాజీ, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post