ఏలూరులో ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి షోరూంలో నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్



ఏలూరులో ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి షోరూంలో నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు..


 రాబోయే రోజుల్లో వాహనాల కొనుగోళ్ల సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ గారు..


తమ కంపెనీ తయారు చేసిన వాహనాలను కొనుగోలు చేసే వాహనదారులకు మన్నికైన సేవలు అందించే సంస్థగా  సుజుకికి పేరుందని మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు.. ఆదివారం ఏలూరు పర్యటనలో భాగంగా సుజుకి షోరూం అధినేత నారా శేషు గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు మార్గమధ్యంలో ఏలూరు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ గారు.. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) గారు, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, సుజుకి షోరూం అధినేత నారా శేషు గారితో కలిసి శ్రీ బాలాజీ థియేటర్ ఎదురుగా ఉన్న హోటల్ ఎన్ లో ప్రముఖ వాహన తయారీ సంస్థ  శ్రీ కృష్ణ సుజుకి షోరూంలో నూతన వాహనాలను ప్రారంభించారు.. అనంతరం మంత్రి తన చేతుల మీదుగా  ''ఆల్ న్యూ యాక్సెస్ స్కూటీ''  వాహనాలను కొనుగోలు చేసిన వాహనదారులకు నూతన వాహనాలు, సంబంధిత కీ అందించారు. స్వయంగా మంత్రి దుర్గేష్ గారు వాహనాన్ని నడిపారు..


 ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ బాహ్య ప్రపంచంలో ఎక్కడ చూసినా సుజుకి వాహనాలు అధికంగా కనిపిస్తున్నాయని  అన్నారు. కారణం  సుజుకి సంస్థ ఎప్పటికప్పుడు వాహనదారులకు మరింత సౌలభ్యంగా కొత్త వాహనాలను తీసుకురావడం జరుగుతుందన్నారు.. ఈ క్రమంలో తాను కొత్త వాహనాలను ప్రారంభించిన మరుక్షణమే ఐదు మంది వాహనదారులు కొనుగోలు చేయడం ఆనందంగా ఉందన్నారు..  రాబోయే రోజుల్లో ఈ వాహనాలకు కొనుగోలు మరింత పెరగాలని మంత్రి దుర్గేష్ గారు ఆకాంక్షించారు.. వ్యాపారంతో పాటు సమాజ సేవ చేస్తున్న స్థానిక సుజుకి షోరూం అధినేత  నారా శేషు గారిని ప్రత్యేకంగా మంత్రి దుర్గేష్ గారు అభినందించారు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయన ఎన్. ఫౌండేషన్ స్థాపించి బయట వేరే సంస్థ లో పని చేస్తున్న సిబ్బందికి వైద్య చికిత్సల నిమిత్తం రూ. 25,000 ఆర్ధిక సాయం చేయడం అభినందనీయమన్నారు. తనకు వచ్చిన లాభంలో పేద ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన అభినందనీయమని మంత్రి దుర్గేష్ గారు ఈ సందర్భంగా అన్నారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, సుజుకి కస్టమర్లు పాల్గొన్నారు..


 

Post a Comment

Previous Post Next Post