ఏలూరులో జనసేన నాయకులు నారా శేషు ఆధ్వర్యంలో 10,000 మట్టి వినాయక ప్రతిమలు, 10,000 వినాయక వ్రత కల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమం.







 ఏలూరులో జనసేన నాయకులు నారా శేషు  ఆధ్వర్యంలో 10,000 మట్టి వినాయక ప్రతిమలు, 10,000 వినాయక వ్రత కల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమం.

ఏలూరు, ఆగస్టు 26:- ఏలూరు జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకులు, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, హోటల్ ఎన్, హోటల్ ఎన్ స్క్వేర్, సుజుకీ షోరూం సంస్థల అధినేత, జనసేన నాయకులు నారా శేషు  ఆధ్వర్యంలో మంగళవారం నగర ప్రజలకు 10,000 వినాయక ప్రతిమలు, 10,000 వినాయక వ్రత కల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు నగరంలోని జూట్ మిల్లు వద్ద ఉన్న ధర్మభేరి ప్రాంగణంలో, సత్రంపాడు శ్రీ కృష్ణ సుజుకీ షోరూం ఆపోజిట్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ వద్ద, అమీనాపేట లో- బ్రిడ్జి బ్యాంకు ఆఫ్ బరోడా వద్ద, తూర్పు వీధి శివాలయం వద్ద ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో నారా శేషు  మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదివేల వినాయక ప్రతిమలు, వ్రత కల్ప పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 10,000 వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు. సుజుకి షోరూం అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గాలి, నీరు, మరింత కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఇందుకుగాను వినాయక చవితి మట్టి ప్రతిమలను, విగ్రహాలను ఏర్పాటు చేసి కాలుష్య రహిత వాతావరణం ఉండే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వాములు కావాలని నారా శేషు  సూచించారు. తనకు ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలకు ముందుగా నారా శేషు  వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వ విఘ్నాలను తొలగించే ఆ వినాయకుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు.

Post a Comment

Previous Post Next Post