నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.



నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.

ఏలూరు, ఆగస్టు 26:- ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, సోదర సోదరీ మణులకు, కార్మిక, కర్షక శ్రామిక వర్గాలకు, పెన్షనర్లకు, రైతు సోదరులకు, వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు, అందరికీ పేరుపేరునా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనను అందిస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడుకి, మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, పౌర సరఫరాల మంత్రి వర్యులు  నాదెండ్ల మనోహర్ కి, జనసేన, తెలుగుదేశం బిజెపి కూటమి పార్టీల నాయకులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు,  మెగా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సంవత్సరంలో మొట్టమొదటి వచ్చే పండుగ వినాయక చవితి సందర్భంగా, సర్వవిజ్ఞాలను తొలగించే ఆ వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఏలూరులో మంచి పరిపాలనను అందిస్తున్న ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు కి, పీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ పేరుపేరునా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు..

Post a Comment

Previous Post Next Post