శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో ప్రభుత్వ చీఫ్ విప్ జివి.
వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారo ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే శ్రీ జి.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన నూతన చైర్మన్‌గా ఎంపికైన మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీ జివి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు.ఆలయ అధికారులు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్.నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
