ఇంటెన్సిఫైడ్ ఐ ఈ సి క్యాంపియన్.




ఇంటెన్సిఫైడ్ ఐ ఈ సి  క్యాంపియన్.

 
ప్రకాశం జిల్లా (క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

          ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం, పందిళ్లపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు  ఏపీ సాక్స్ / జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు *చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో 8,9,10, చదువుతున్న స్టూడెంట్స్ కు
 హెచ్ఐవి/ఎయిడ్స్ , సుఖ వ్యాధుల పట్ల మరియు డ్రగ్ డి- ఆడిక్షన్ లపైఅవగాహన .
   
 ఈ  కార్యక్రమంలో కంబం గవర్నమెంట్ హాస్పిటల్ ictc కౌన్సిలర్ శేషు కుమారి గారు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ,అలాగే హెచ్ఐవి /ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతే ప్రాధాన్యం అని తెలియజేశారు .హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వారిపట్ల ఎవరు చిన్నచూపు చూపకూడదని అలా చూసిన వారిపట్ల చట్టరీత్యా చర్యలు కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా చట్టం ఉందని వారు తెలియజేశారు. హెచ్.ఐ.వి వ్యాధి పట్ల  యువత  అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని   
హెచ్.ఐ.వి కేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు , హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవితో కలుషితమైన సూదులు,సిరంజీలు,పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. 
 అదేవిదంగా,హెచ్.ఐ.వి. ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ART కేంద్రాలు, లింక్ ART కేంద్రాల ద్వారా ఉచితంగా ART మందులు అందుబాటులో ఉన్నాయని, మందులు వాడుతూ, వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలియచేసారు. హెచ్.ఐ.వి. ఉందనే కారణంతో వివక్ష చూపకూడదు అని, అది హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ చట్టం - 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలియచేసారు. 
 హెచ్.ఐ.వి. పట్ల ఎటువంటి సందేహాలు/ అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలియచేసారు. కండోమ్ బాక్సు ఇబ్బందులు గురించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలోని అన్ని  గ్రామాల్లో అవగహన సదస్సులు  మరియు సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యముగా యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు , గ్రామ ప్రజలను భాగస్వాములు చెయ్యాలి అని చేప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ బి. భారతి గారు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని- విద్యార్థులు స్థానిక లింక్ వర్కర్  చరణ్ పాల్గొనడం జరిగింది.అనంతరం పందిళ్లపల్లి  గ్రామములో డోర్ టూ డోర్ విజట్ చేసి గ్రామస్తులకు కూడా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post