కంభం లో శాంతి సమావేశం.







కంభం లో శాంతి సమావేశం.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి ( దాసరి యోబు ) :- ప్రకాశం జిల్లా కంభం లో గణేష్ చతుర్థి సందర్భంగా ప్రకాశం ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈరోజు కంభం పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు అధ్యక్షతన జరిగింది.
 ఈ కార్యక్రమానికి మార్కాపురం డి.ఎస్.పి. యు నాగరాజు.కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు పాల్గొని మాట్లాడుతూ వినాయక చవితి పండగ రోజున భారీ విగ్రహాలు పెట్టుకోకుండా కరెంటు తీగలకు అడ్డు రాకుండా చూసుకోవాలని వినాయక ఉత్సవాల కమిటీ సభ్యులకు తెలియజేశారు. అలాగే చర్చిల దగ్గర కానీ మసీదుల దగ్గర గాని డీజే సౌండ్ ఎక్కువ పెట్టినచో అల్లరి చేసిన వారి పైన కేసులు పెట్టడమే కాకుండా వినాయక ఉత్సవాల కమిటీ సభ్యుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ నాగరాజు తెలియజేశారు. అలాగే కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు మాట్లాడుతూ ఎవరైనా ఆకతాయిలు బైకుల మీద కానీ రాష్ట్ర డ్రైవింగ్ చేసిన మద్యం సేవించి అల్లరి చేసిన వారిపైన మరియు ఊరేగింపులో కానీ వినాయక మండపాల దగ్గర కానీ అల్లరి చేసి సినిమా పాటలకు డ్యాన్సులు వేసిన కఠిన చర్యలు తప్పవని అని హెచ్చరించారు.
 కంభం తాసిల్దార్ వి కిరణ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా వినాయక పండుగను గొప్పగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల లాగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ మండపాల మంటలు చెలరేగకుండా  ఇసుక. మరియు డ్రమ్ములతో నీటిని ఉంచాలని వినాయక మహోత్సవ కమిటీ వారికి తెలియజేశారు.
 ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు. హిందూ ముస్లిం పెద్దలు క్రైస్తవ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కంభం చెరువు కట్టకు వెళ్లే మార్గాన్ని డిఎస్పి యు నాగరాజు. కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్. కంభం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు పరిశీలించారు.

Post a Comment

Previous Post Next Post