అర్ధవీడు ఎంపీడీవో కార్యాలయం నుండి.పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయండి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా అర్ధవీడుమండలంలోని వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఎంపీడీవో కె.వీర రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో గ్రామ పంచాయతీల అభివృద్ధి సూచిక 2.0 వెర్షన్ పై గ్రామల సర్పంచులకు, ఎంపీటీసీలకు కార్యదర్శులకు, మండల అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో ప్రజా సమస్యలను గుర్తించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ సర్వేలు సకాలంలో పూర్తి చేయించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి తయారుచేసిన నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు. అన్ని శాఖలకు సంబంధించిన వారి వారి అభివృద్ధి పనుల డేటాను సేకరించాలని చెప్పారు. ఈ డేటా ఆధారంగా చేసుకుని 2025 - 26 సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది అని చెప్పారు. అలసత్వం వహించవద్దని తెలిపారు . పంచాయతీ నుంచి సేకరించిన డేటాను జిల్లా జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామపంచాయతీ అభివృద్ధి సూచిక 2.0 వర్షన్ పై పంచాయతీ కార్యదర్శి పి.కృష్ణ మోహన్ రెడ్డి శిక్షణ ఇచ్చారు.
వివిధ శాఖల సిబ్బంది డేటా సేకరించేటప్పుడు తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదే ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పారు. గ్రామపంచాయతీ నుంచి సేకరించిన డేటా ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
