భీమడోలు పంచాయితీలో కోటి రూపాయలు నిధులు దుర్వినియోగం పై 5 నెలలకు లోతైన విచారణ..
ఏలూరు జిల్లా భీమడోలు పంచాయతీలో 5 నెలల కాలంలో కోటి రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆ పంచాయతీకి చెందిన కొత్తపల్లి చంద్రమౌళి అనే దళితుడు
ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, పంచాయతీ రాజ్ కమీషన్ కు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు వెనక్కు తీసుకోమని పలు వ్యక్తులు నుండి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా, ఫిర్యాదు వెనక్కు తీసుకోకపోవడంతో డ్రైనేజ్లు తీస్తున్నాము అనే సాకుతో వరద ముంపుకు అడ్డుగా ఉన్న కల్వర్ట్ లను పునరుద్దరించకుండా, ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడలను కూల్చివేయడమే కాక, నోటీస్ ఇచ్చి కొట్టండి అన్న మాటకు రెచ్చిపోయి, అప్పటికప్పుడు కేసు పెట్టి పోలీసు వారి చేత FIR చేయించి, ప్రహరీ గోడలు కూల్చివేయడంతో, జరిగిన దారుణంపై, రాష్ట్ర ఎస్ సి కమీషన్, జాతీయ ఎస్ సి కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, లోకాయుక్తతో పాటు ఇతర నిఘా సంస్థలకు
చేసిన పిర్యాదు పై రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు, చంద్రమౌళి చేసిన పిర్యాదు మేరకు , ఫిర్యాదును పరిశీలించిన సంబంధిత శాఖల అధికారులు, ఎస్ సి కమీషన్ సంయుక్త ఆదేశాలతో భీమడోలు పంచాయతీలో జరిగిన కోటి రూపాయలకు పైగా నిధుల దుర్వినియోగం పై జిల్లా స్థాయి అధికారుల సారథ్యంలో డి.ఎల్.పి.ఓ తో బాటు ఒక అధికార బృందం శుక్రవారం
భీమడోలు గ్రామ పంచాయతీలో
విచారణ చేపట్టారు.. విచారణాధికారులు పంచాయతీ లో నిధుల దుర్వినియోగం పై లోతుగా విచారణ జరిపేందుకు పంచాయతీ
రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు..
పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయని దళితుడు చంద్రమౌళి చేసిన పిర్యాదు పై విచారణాధికారులు పంచాయతీకి పరిపాలనకు చెందిన జనరల్ క్యాష్ బుక్స్ రెండు, 2024 అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు, 15 వ ఆర్థిక సంఘ నిధుల క్యాష్ బుక్ ఒకటి 2024 అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు , జనరల్ ఫండ్ వోచర్లు, వోచర్ నంబర్ 128 నుండి 303 వరకు,15 ఆర్థిక సంఘం నిధుల వినియోగపు వోచర్లు, వోచర్ నంబర్ 18 నుండి 94 తో బాటు పంచాయతీ సాధారణ స.ఆదేశపు ఎజెండా బుక్ 1, సాధారణ సమసవేశాల మినిట్ బుక్ 1, వంటి పంచాయతీ రికార్డులను విచారానాధికారులు పరిశీలించి తీసుకువెళ్లారు.. విచారణలో భాగంగా అధికారులు చంద్ర మౌళి ఇంటి ప్రహరిని పంచాయతీ సిబ్బంది ధ్వంసం చేసిన తీరును కుడా పరిశీలించారు..
విచారణలో చంద్రమౌళి ది. 24/3/2025 వ తేదీన పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం ఎలా జరిగాయి అనే పూర్తి సమాచారంతో కూడిన పిర్యాదు మరియు ఆధారాలను మరో సారి
జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు, పంపిన కాపీని, సదరు సెక్రటరీ మీద నిధులు దుర్వినియోగం అయ్యాయని, రికవరి చేయించాలని ఫిర్యాదు చేసాను, అనే కక్షతో దళితుల గృహం పట్ల ఆమె వ్యవహరించిన తీరు, అక్రమంగా కేసు కట్టించిన తీరును విచారణాధికారులుకు తెలియచేయడం జరిగింది..
విచారణ అనంతరం విచారణ అధికారి DLPO అమ్మాజీ గారు మాట్లాడుతూ PGRS లో వచ్చిన ఫీర్యాదుపై సమగ్ర విచారణ కొరకు అవసరం అయిన రికార్డ్స్ అన్నీ తీసువెళ్తున్నామని త్వరలో కలెక్టర్ గారికి నివేదికక అందచేస్తామని తెలిపారు..

