ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ సద్వినియోగం చేసుకోండి - చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.



ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ సద్వినియోగం చేసుకోండి -  చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.

కూటమి ప్రభుత్వం బిల్డింగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ఏర్పాటు చేస్తుంది

 చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.

చింతలపూడి :- పట్టణంలోని లైన్స్ క్లబ్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా గృహ వినియోగదారులు అతి తక్కువ విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది అని, ఇంటి పై కప్పుపై కనీసం 10 చ.మీ/100 చ.అ స్థలంలో 1 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవచ్చు అని అన్నారు.ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసి, ప్రజలకు లబ్ది కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని” అన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సౌరశక్తి వినియోగం పెరిగి, విద్యుత్ బిల్లు తగ్గించే అవకాశాలు ఉంటాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ద్వారా అందరూ పర్యావరణ అనుకూలమైన శక్తిని ఉపయోగించి, విద్యుత్ వృథాను తగ్గించవచ్చు అని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రజల ప్రయోజనాలు పెరుగుతాయని, ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ డిఈతో పాటు నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు మండల పట్టణ అధ్యక్షులు డ్వాక్రా సంఘాలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post