సీపీఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏఐవైఎఫ్ ప్రతినిధి బృందం.
TELANGAANA.మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మహారాజా గార్డెన్స్ లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలకు అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులుగా అన్ని జిల్లాల నుండి ఎంపికై, ఈ మహాసభలలో పాల్గొన్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర తెలిపారు.
అదే విధంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన రంగాన్ని విస్మరిస్తున్నారని, ప్రధానంగా భారత రాజ్యాంగం కల్పించిన ఉపాధి హక్కులను యువతకు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం దేశంలోని యువతను మతం మత్తులో ముంచడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడానికి కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు.
నిరుద్యోగ అంశం, రాజీవ్ యువ వికాసం అంశాలపై ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మహాసభలో తీర్మానం ను ప్రవేశపెట్టారు.
