కూటమి ప్రభుత్వం పేదలకు కొండంత అండ - ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.




కూటమి ప్రభుత్వం పేదలకు కొండంత అండ -  ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.

ఏలూరు..ప్రభుత్వ ఉద్యోగ, సిబ్బందికి అన్నివిధాలా అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు కృతనిశ్చయంతో ఉన్నారనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో  స్థానిక 15వ డివిజన్ కు చెందిన కొమిరి పోసమ్మ 3రోజుల కుమార్తె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హాస్పిటల్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండగా ఆమె విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి LOC 2,50,000 జారీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post