శ్రీ నల్ల బసవలింగం సత్రం (రామాలయం) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.








శ్రీ నల్ల బసవలింగం సత్రం (రామాలయం) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

* ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.

* సత్రం చైర్మన్ గా దోనేపూడి లోవరాజు ప్రమాణ స్వీకారం.

* అభినందనలు తెలిపిన కూటమి పార్టీల నాయకులు.

ఏలూరు, శ్రీ నల్ల బసవలింగ సత్రం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు నగరం శనివారం పేటలో ఉన్న శ్రీ నల్ల బసవలింగ సత్రం (రామాలయం) దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో ఎం రాధా, ఏలూరు తనిఖిదారుడు చల్లా బాబు నాయుడు నూతన పాలక మండలి తో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా దోనేపూడి లోవరాజు, డైరెక్టర్లు గా సిరాపు సత్యనారాయణ, దేవరపల్లి రత్నబాబు, తాడివలస పవన్ కుమార్, జువ్వలగుంట తులసి, కొచ్చర్ల దుర్గ, పిల్ల వెంకటలక్ష్మి భవాని, కిల్లి సత్యవతి, నాగ వెంకట సత్యనారాయణ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ దోనేపూడి లోవరాజు కీ, ఇతర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఏలూరు నగర పరిధిలో ఉన్న ఈ రామాలయాన్ని జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో బోర్డు మెంబర్లను ఇచ్చిన ఏలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి కృతజ్ఞతలు తెలిపారు. శనివారపు పేట రోడ్డులో ఉన్న ఈ రామాలయానికి వేమూరి శ్రీధర్  సారధ్యంలో అభివృధ్ధి జరిగిందన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దేవాలయ కమిటీ సభ్యులందరికీ దేవస్థానం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆ దేవుని అనుగ్రహంతో పాటు ప్రజల మన్ననలు పొందాలని, దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. 

దేవస్థానం చైర్మన్ దోనేపూడి లోవరాజు మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి అందరి సహకారం తీసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనను చైర్మన్గా ఎంపిక చేసిన గౌరవ ఎమ్మెల్యే బడేటి చంటి గారికి, మా ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు మాట్లాడారు. చైర్మన్ గా ఎన్నికైన లోవరాజును పలువురు అభినందిస్తూ పుష్ప గుఛ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, దెందులూరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ గుమ్మడి చైతన్య, 24 వ డివిజన్ టిడిపి ఇంచార్జీ కడియాల విజయలక్ష్మి, 26 వ డివిజన్ టిడిపి ఇంచార్జీ చేకూరి గణేష్, ఎస్సీ నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, స్థానిక కూటమి నాయకులు వేమూరి శ్రీధర్ బాబు, కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post