ఏలూరు అయ్యప్ప అన్న సమారాధనోత్సవం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవ కార్యక్రమానికి ముహూర్తం.
స్వామి శరణం.. అయ్యప్ప శరణం... స్వామియే శరణమయ్యప్ప.
ఏలూరు :- అయ్యప్ప మాల ధరించే స్వాములకు బాలాజీ థియేటర్ వద్ద గల లింగమల్లు శ్రీనివాసేంద్ర బాబు మిల్లు ఆవరణలో అన్నదాన మహోత్సవ కార్యక్రమానికి ముహూర్తంగా ఏలూరు అయ్యప్ప అన్న సమారాధనోత్సవం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8.00 గంటలకు పందిరి రాట వేశారు..
ఈ సందర్భంగా తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప అన్నదాన కార్యక్రమాన్ని అక్టోబర్ మూడో తారీకు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కావున మాల ధరించే స్వాములంతా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు గంగానమ్మ జాతర ఉన్నప్పటికీ మాల వేసుకోవచ్చు అని, భజనలు చేయవచ్చని, మాల కు జాతర సంబంధం లేదని, భక్తులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప అన్న సమరాధనోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

