కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కుల సంఘ నాయకులతో శాంతి సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం: వినాయక చవితి సందర్భంగా పీస్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మార్కాపురం ఓఎస్డివో నవజ్యోతి మిశ్రా మరియు మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజ్ పాల్గొని వారు మాట్లాడుతూ
విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన ఊరేగింపులు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు అధికారులు నిర్వాహకులకు కుల సంఘ నాయకులకు పలు సూచనలు చేశారు.
నిమజ్జనం రోజు వినాయక విగ్రహాలు సాయంత్రం 6లోపు కంభం చెరువుకట్టకు చేరుకునేలా చూడాలని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా సూచించారు.
డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే ఎవరైనా ఆకతాయిలు కానీ అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక పనులకు పాటుపడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మాజీ ఉపసర్పంచ్ సయ్యద్ ఖాసిం మాట్లాడుతూ కంభంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని కోరారు. డీజేలకు అనుమతి లేనందున నిర్వాహకుల తరఫున ఓఎస్డీని అనుమతి కోసం కోరారు. పెద్ద విగ్రహాలకంటే చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పండుగను భక్తిశ్రద్ధలతో, ఆహ్లాదకరంగా నిర్వహించాలని సూచించారు.
పండుగ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని అధికారులు కోరారు. నిమజ్జనం రోజున 150 మంది పోలీస్ ప్రొటెక్షన్ భద్రత సిబ్బందిని నియమిస్తున్నట్టు ఓ ఎస్ డి తెలిపారు.
అనంతరం కంభం చెరువును ఓఎస్డివో నవ జ్యోతి మిశ్రా. డీఎస్పీ నాగరాజ్. సీఐ మల్లికార్జున్. కంభం ఎస్సై కృష్ణారెడ్డి. కూటమి నాయకులు. వినాయక విగ్రహ కమిటీ నాయకులు. చెరువు కట్టకు పోవు రహదారులను పరిశీలించారు.

