వైఎస్సార్‌సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కందుల.




 వైఎస్సార్‌సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కందుల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

దగా డీఎస్సీ అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదు

అక్రమాలు జరగలేదని కోర్టులు స్పష్టం చేసినా రాజకీయాల కోసం ధర్నాలు చేయడం దురదృష్టకరం.

మార్కాపురం జిల్లా 

డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలపై మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు కందుల నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  ముందుగా 2025 డీఎస్సీ అభ్యర్థులతో మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

 ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ  

“దగా డీఎస్సీ” అంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కోర్టులు స్పష్టం చేసినప్పటికీ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

ఆన్‌లైన్ విధానంలో, జంబ్లింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించే పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కావడం సాధ్యం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరీక్షా విధానంపై అవగాహన లేకుండా పేపర్ లీక్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువతలో అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

డీఎస్సీ–2025 నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, కేవలం 45 రోజుల్లోనే ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని కందుల నారాయణ రెడ్డి అన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలకు ఎమ్మెల్యే హితవు పలికారు.

డీఎస్సీ అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డీఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post