పి యం ఏ జె ఏ వై.పథకం అమలుపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.



 పి యం ఏ జె ఏ వై.పథకం అమలుపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లాఒంగోలు బలహీన వర్గాల ప్రాంతాలలో అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను వాస్తవ స్ఫూర్తితో ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు స్పష్టం చేశారు.

సోమవారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన ' ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన ( పి.ఎం.ఏ.జె.ఏ.వై ) ' పథకం అమలుపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాకు కేటాయించిన నిధులు, వాటిని ఖర్చు చేస్తున్న తీరును జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీ.ఎన్.లక్ష్మానాయక్ ఈ సందర్భంగా వివరించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద వచ్చిన నిధులను సమర్ధంగా వినియోగించడంతోపాటు వాటికి సంబంధించిన బిల్లులను సంబంధిత వెబ్ సైట్ లో త్వరగా అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా రెండో విడత నిధులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ అప్లోడ్ ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని చెప్పారు.

బలహీనవర్గాల ఆవాస ప్రాంతాలలో త్రాగునీరు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల 

కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా ఎంపీడీవోలు మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, డ్వామా పిడి జోసఫ్ కుమార్, జిల్లా బిసి సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, డీఈవో రేణుక, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పిడి పద్మ సునంద, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post