మొక్కలు నాటదాం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం ప్రకాశం ఎస్పీ.


మొక్కలు నాటదాం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం ప్రకాశం ఎస్పీ.

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలి:

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం ఒంగోల్ మిషన్ హరిత ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కల నాటకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ , పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మొక్కలు నాటడం ద్వారా ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ మరింత పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ కాలుష్యన్ని నివారించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని,మనం ఉపయోగించే వాహనాల అధిక వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ వంటి వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుందని, అదే ప్రాణ వాయువు అని,మనం చేసే పనుల వల్ల కాలుష్యం రోజురోజుకూ పెరిగి అనేక జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. మనమందరం మొక్కలు నాటడం వల్ల ప్రాణవాయువును పెంచడంతోపాటు జీవరాశులు అంతరించిపోకుండా మేలు చేసిన వారవుతారని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కలను పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలనీ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post