క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి.రావికమతం జూలై :23 అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, కఠిన ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముఖ్య నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
కొత్తకోట సి.ఐ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో, రావికమతం ఎస్.ఐ రఘువర్మ మరియు వారి సిబ్బంది పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
A-5: మోపర్తి యశ్వంత్ 23.సం
A-6: షేక్ కరీముల్లా 21.సం సత్తెనపల్లి, పల్నాడు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు
అరెస్టయిన A-5, A-6 నిందితులను గురువారం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.
అనకాపల్లి జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ చట్టం (NDPS Act) కింద కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
