కే.జె పురంలో ఘనంగా వైయస్సార్ 77వ జయంతి వేడుకలు.


 కే.జె పురంలో ఘనంగా వైయస్సార్ 77వ జయంతి వేడుకలు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై:08

మహానేత దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైయస్సార్ విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు అర్పించి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతు పేదల, బడుగుల సర్వతోముఖాభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి కృషి చేసారని 

ఆయన బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతకు పాటుపడ్డారని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భవిష్యత్తు ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు వంటి ప్రజలకు ఉపయోగకరమైన పథకాలను అమలు చేశారని ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాళ్ల రాము. పెంటకోట మాలినాయుడు

బిశెట్టి జగ్గాప్పారావు. కాళ్ళ అప్పలనాయుడు. పరిమి కాసులు జగ్గారావు. కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన కు నివాళులర్పించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post