ఆలయ చోరీ కేసులో నిందుతులు అరెస్ట్.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై :23
చోడవరం పట్టణంలో శనివారం అనగా 18:07:2026 న చోడవరంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం మరియు శ్రీ రాములు వారి దేవాలయలో హుండీ చోరీ నేరలకు పాల్పడుతున్నా ముగ్గురు వేర్వేరు ప్రాంతాలుకు చెందిన ఏ1 ముద్దాయి జెడిపల్లి భూపతి 23 సం. ఇతనిపై చోడవరం పోలీస్ స్టేషన్లో చోరీ కేసు మరియు చెన్నై ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదు అయినట్టు తెలిపారు అలాగే a2 ముద్దాయి వర కార్తీక్ 21 సం.తమిళనాడు.
a3 నెల్లి లోకేష్ 19 సం.విజయనగరం జిల్లా బొబ్బిలి
వీరు చోడవరం పట్టణంలో అర్ధరాత్రి సమయంలో రెండు వేరువేరు ఆలయలో చోరీలకు పాల్పడ్డారని పోలీస్లు తెలిపారు వీరు చోరీ చేసిన నగదు సుమారు 6000 రూపాయలు వీరు చోరీ చేసిన కొని రోజులు వ్యవదలో నిందుతులు ప్రమేయం గుర్తించి వీరిని 22:07:2026 అనగా బుధవారం అరెస్ట్ చేశామని ఎస్సై నాగ కార్తీక్ తెలిపారు అలాగే వీరి వద్ద 2859 రూపాయలు రికవరీ చేసి కేసు నమోదు చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కేసును అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు మరియు అదనపు ఎస్పీ ఎల్ మోహనరావు. (ఎస్ డీ పి ఓ)సూచనలుతో చోడవరం సీఐ అప్పలరాజు ఆధ్వర్యంలో ఎస్సై లు నాగ కార్తీక్. జోగారావు. సిబ్బంది పి సి సోమశేఖర్. నరేంద్ర. శ్రీను కాశీ. బాలాజీ వీరు ఎంతో ఎంతో చాకచక్యంగా కృషి చేసి చోరికి పాల్పడ్డ నిందితులను పట్టుకొని రెండు కేసులను చేదించడం జరిగిందని ఎస్ఐ నాగ కార్తీక్ తెలిపారు
