విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
పలాస విద్యుత్ డివిజన్ అధికారి జి. నాగేశ్వరావుకు ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంక్షేమ సంఘం వినతి.
పలాస, జూలై 22:
ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంక్షేమ సంఘం (యూనియన్ నెం. 106/2026 – నూట ఆరు బై ఇరవై ఇరవై ఆరు) ప్రతినిధులు పలాస విద్యుత్ డివిజన్ అధికారి జి. నాగేశ్వరావును మర్యాదపూర్వకంగా కలిసి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు కింతల శంకరరావు నేతృత్వంలో యూనియన్ సభ్యులను డివిజన్ అధికారి జి. నాగేశ్వరావుకు పరిచయం చేశారు. అనంతరం 2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన పెయిడ్ హాలిడేస్ (Paid Holidays) బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం, అలాగే కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను సవివరంగా వివరించారు.
వినతిపై స్పందించిన డివిజన్ అధికారి జి. నాగేశ్వరావు కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంక్షేమ సంఘం (యూనియన్ నెం. 106/2026) వ్యవస్థాపకులు, అధ్యక్షుడు కింతల శంకరరావు, జిల్లా ట్రెజరర్ ఆర్. కుమారస్వామి, పలాస డివిజన్ అధ్యక్షుడు దుశ్యత్, యూనియన్ నాయకులు, వివిధ హోదాల్లోని ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
