పులివెందులలో తప్పిన పెను ప్రమాదం.
జూలై 6 2026 (ఎన్ మునిశేఖర కడప డిస్టిక్ ఇంచార్జ్ క్రైమ్ 9 మీడియా)
పులివెందుల మార్కెట్ యార్డ్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు ఊడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
