యంఐజి లే అవుట్ ను అభివృద్ధి చేసి త్వరితగతిన ప్రజలకు వాడుకులోకి తీసుకురావాలి -మంత్రి పొంగూరు నారాయణ.
యంఐజి లేఅవుట్ ను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, జూలై 04: శనివారపుపేట యంఐజి లేఅవుట్ ను శనివారం రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, నగర పాలక సంస్థ మేయరు షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ పట్టణానికి దగ్గరలో ఉన్న యంఐజి లే అవుట్ ను అభివృద్ధి చేసి త్వరితగతిన ప్రజలకు వాడుకులోకి తీసుకురావాలని ఆదేశించారు. లేఅవుట్‌లో చేపట్టాల్సిన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్తు, పారిశుధ్యం, ప్లాంటేషన్, తదితర మౌళిక సదుపాయాలు ఈ నెలచివరి నాటికి పూర్తిచెయ్యాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను తొలగించామని , కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచెయ్యాలని సూచించారు. మిగిలి ఉన్న ప్లాట్లకు త్వరితగతిన బహిరంగ వేలం నిర్వహించి, ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇయన్ సి యం.ప్రభాకరరావు, ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, ఏయంసి ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, చోడే వెంకటరత్నం, వివిధ ప్లానింగు అధికారి యన్.సురేఖ, తహశీల్దారు కె.గాయత్రీదేవి, కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజనీరింగు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
