టెక్కలిలో ఘనంగా జనతా వారధి ప్రారంభం.. ప్రజల అర్జీల స్వీకరణ.


టెక్కలిలో ఘనంగా జనతా వారధి ప్రారంభం.. ప్రజల అర్జీల స్వీకరణ.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

టెక్కలి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన "జనతా వారధి" కార్యక్రమాన్ని శుక్రవారం టెక్కలి బీజేపీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.

ఈ కార్యక్రమం టెక్కలి బీజేపీ మండల అధ్యక్షులు జర్జాన రాంజీ ఆధ్వర్యంలో నిర్వహించగా, జనతా వారధి ఇన్‌చార్జిగా ఆకుల ప్రకాష్ వ్యవహరించారు. నిర్వహణ బాధ్యతలను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అన్నెపు ఉమామహేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నడుపూరి లక్ష్మీనారాయణ చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారంలో ఈ కార్యక్రమం వారధిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post