రాజముద్ర పాసుబుక్కులతో రైతులకు భూ హక్కుల భరోసా.

 




రాజముద్ర పాసుబుక్కులతో రైతులకు భూ హక్కుల భరోసా.

బ్రాహ్మణతర్లాలో ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా పంపిణీ.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపు.

పలాస, జూలై 3 : రైతుల భూ హక్కులను మరింత పటిష్ఠం చేసి, భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పేర్కొన్నారు. పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు పాసుబుక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల భూముల యాజమాన్య హక్కులకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కులను అందజేస్తోందన్నారు. భూ రికార్డులను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందిస్తూ భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారంతో పాటు సాగుకు అవసరమైన సౌకర్యాల కల్పన, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పలాస ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్ కుమార్, మండల కార్యదర్శి దువ్వాడ సంతోష్ నాయుడు, వంకల కూర్మారావు, హర్ష నాయుడు, యాదగిరి, మురళి, కృష్ణారావు, సుధాకర్, బమ్మిడి ఆనందు, ప్రభుదాస్, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post