సవర గోవిందపురంలో ఘనంగా ప్రారంభమైన 'ఇంటి ఇంటికి తెలుగుదేశం' కార్యక్రమం.



 సవర గోవిందపురంలో ఘనంగా ప్రారంభమైన 'ఇంటి ఇంటికి తెలుగుదేశం' కార్యక్రమం.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 28: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఇంటి ఇంటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని పలాస మండలం సవర గోవిందపురం గ్రామంలో పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తుల సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. "తల్లికి వందనం" పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ₹13,000 ఆర్థిక సాయం, సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, "అన్నదాత సుఖీభవ" పథకం కింద రైతులకు ₹20,000 పెట్టుబడి సాయం, ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధులు, వితంతువులకు ₹4,000, వికలాంగులకు ₹6,000, మంచానికే పరిమితమైన వారికి ₹15,000, డయాలసిస్ బాధితులకు ₹10,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామం, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విద్యారంగంలో సర్వేపల్లి రాధాకృష్ణ మిషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విట్టల్, పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్, మండల కార్యదర్శి దువ్వాడ సంతోష్ నాయుడు, క్లస్టర్ కన్వీనర్లు తమ్మినేని గంగారం, మురిపింటి కుమార్ రాజు, సవర సోమేశ్, ప్రభుదాస్, కుత్తుం ప్రకాష్, మాధవ, బాలయ్య, మున్నా, శాంతమ్మతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post