కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


 కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కంభం:- స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి 11 వర్ధంతి స్మరణ దినోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కంభం పట్టణ సీనియర్ చేతిరాత నిపుణులైన సుబ్రమణ్యం పాల్గొని చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.

ఇప్పుడు మన దేశంలో ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాది ఆయన. జీవిత మొత్తం మీద ఒక విమర్శ లేని మచ్చలేని మనిషి, ఇప్పటివరకు ఎంతోమంది రాష్ట్రపతులుగా ఉన్న ఆయన అంత దగ్గర ఎవరు కాలేదు. 

నిరుపేద కుటుంబంలో పుట్టి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగి ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. గొప్ప నాయకుడిగా శాస్త్రవేత్తగా వక్తగా రామేశ్వరం నుండి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సహాయం చేయడానికి ఆయన చిన్న వయసులోనే న్యూస్ పేపర్లు వేసేవారు.

పాఠశాల చదువుతున్న రోజుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలని జిజ్ఞాస ఆయనలో ఎంతగానో ఉండేది. ఎగిరే పక్షిని చూసి తను కూడా గాలిలో ఎగరాలని అనుకున్నారు అందుకే ఎలాగైనా పైలెట్ అవ్వాలని కోరుకున్నారు. 

 స్కాలర్షిప్ సహాయంతో ఎన్ఐటి లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు 

భారతదేశం నుండి అంతరిక్షంలోకి SLV 3 జులై 18 1980లో లాంచ్ చేసి రోహిణి సాటిలైట్ ని ఆర్బిట్ లోకి లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఘనత లో ముఖ్య పాత్ర పోషించారు ఆయన. 

భారతదేశ ఆర్మీ కోసం అగ్ని, పృద్వి, ఆకాష్, త్రిశూల్ వంటి మరెన్నో శక్తివంతమైన ఆయుధాలను తయారుచేసి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిర్మించడంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అడ్మిన్ శేఖర్ పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post