ప్లెక్సీ బ్యానర్లు కు అనుమతి తప్పనిసరి మున్సిపల్ కమిషనర్.


 ప్లెక్సీ బ్యానర్లు కు అనుమతి తప్పనిసరి మున్సిపల్ కమిషనర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ పరిధిలో పురపాలక సంఘం అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు ఇతర ప్రచార సామగ్రిపై ఈ రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, వాటిని తొలగించడం జరిగినది.

ఈ సందర్భంగా గిద్దలూరు పురపాలక సంఘం కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ పరిధిలో పురపాలక సంఘం ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు లేదా ఇతర ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ప్రజల భద్రత, పట్టణ సౌందర్యం మరియు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని అనధికార ప్రకటనల ఏర్పాటును పురపాలక సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని పేర్కొన్నారు.

అందువల్ల, ఇకపై ఎవరైనా వ్యక్తులు, సంస్థలు, సంఘాలు లేదా రాజకీయ పార్టీలు పురపాలక సంఘం అనుమతి లేకుండా అనధికార ఫ్లెక్సీలు లేదా బ్యానర్లు ఏర్పాటు చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం, 1965 మరియు అమలులో ఉన్న ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అలాగే, వాటి తొలగింపు ఖర్చును సంబంధిత నిర్వాహకుల నుండే వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు.

పట్టణ ప్రజలు, వ్యాపార సంస్థలు, సంఘాలు మరియు రాజకీయ పార్టీలు ప్రకటనలు లేదా ప్రచార సామగ్రి ఏర్పాటు చేయుటకు ముందు తప్పనిసరిగా గిద్దలూరు పురపాలక సంఘం నుండి అనుమతి పొందవలసిందిగా కోరారు. పట్టణ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు మరియు మున్సిపల్ నిబంధనలను పాటించేందుకు అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post