నూతన స్టీల్ ప్లాంటులో రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించండి - ఆడారి కన్నారావు డిమాండ్.


 నూతన స్టీల్ ప్లాంటులో రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించండి -  ఆడారి కన్నారావు డిమాండ్.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై :31

అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం మండలంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నూతన స్టీల్ ప్లాంటులో రైతుల కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని జాతీయ రైతు పరిరక్షణ సమితి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఆడారి. కన్నారావు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా సుమారు 1,000 ( వెయ్యి) ఎకరాలులో 50 వేలు కోట్లు రూపాయలు తోని అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం మండలంలో గల పైడిపాల, పెద్దిపాలెం, బూరుగు పాలెం, తూటిపాల, అడిగర్ల పాలెం మరియు మామిడిపాలెం గ్రామాల్లో గల భూములు కోల్పోయిన ప్రతీ రైతు కుటుంబాలకు ఇంటి కొక ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు. ఆయా జిల్లా పరిధిలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయాలన్నారు. మహిళా రైతులుకి వారి అర్హతలను బట్టి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆయా ప్లాంట్ నిమిత్తం భూములు కోల్పోయిన బాధితులుకి పరిహారం, పునరావాసం మరియు ఆయా కుటుంబాలకు భద్రత కల్పించాలన్నారు. ఈ ప్రాంతంలో ప్లాంట్ స్థాపించడం వలన వెనుక బడిన అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే గాకుండా ఈ ప్లాంట్ నిర్మాణం వలన జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గల నిరుద్యోగులకు మరియు మహిళలుకి కొంత భరోసా మరియు భద్రత ఏర్పడుతుందని ఆడారి. కన్నారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post