నేడు కంభం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
మార్కాపురం జిల్లా కంభం సబ్ డివిజన్.ఒక నెల.ఒక నియోజకవర్గం.నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా రేపు అనగా శుక్రవారం(17-7-26) కంభంలోని గౌతమ్ స్కూల్ దగ్గర గల ఉదయగిరి బృందావనం కళ్యాణ మండపంలో (హోండా షోరూం ఎదురుగా బైపాస్ రోడ్) మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ జీ ఆర్ ఎస్ ) కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
