చోడవరం యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం.



 చోడవరం యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం.

కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన చోడవరం పోలీసులు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై:27

చోడవరం మండలంలోని చోడవరం గ్రామంలో వినాయక ఆలయం సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఫిర్యాదుదారు పోలిపల్లి వెంకట వరప్రసాద్ (52), బ్రాంచ్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చోడవరం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఈ రోజు తెల్లవారుజామున 02:45 గంటల నుండి 03:29 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి, తన వెంట తీసుకువచ్చిన పనిముట్లతో ఏటీఎం నగదు నిల్వ (క్యాష్ చెస్ట్)ను తెరవడానికి పలుమార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం బయటి భాగానికి కొంత నష్టం కలిగించినప్పటికీ, నగదు నిల్వ గదిని తెరవడంలో విఫలమై అక్కడి నుంచి పరారయ్యాడు.

సంఘటన స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్టు చేసేందుకు (ఎస్హెచ్ఓ)చోడవరం వారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే(ఎస్ హెచ్ ఓ), చోడవరం పోలీస్ స్టేషన్ PH 94407 96090 నంబర్‌లో లేదా ఎస్సై బి. జోగారావును PH 81429 36937 నంబర్‌లో సంప్రదించాలని చోడవరం పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post