వితంతు మహిళ ఫై ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం నిర్వాకం.


 వితంతు మహిళ ఫై ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం నిర్వాకం. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవ్వని వైనం.

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో వితంతు మహిళను వేదిస్తున్న ప్రయివేట్ స్కూల్ యజమాన్యం.

ఆర్ధిక స్థితి బాగోలేక ఓ మహిళ తన పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో చేర్పించాలని తన పిల్లల టీ సీ ల కోసం రెండు నెలలుగా ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్న కనికరించని వైనం.

 మార్కాపురం జిల్లా రాచర్ల మండలం లోని విద్వాన్ స్కూల్ క్రూరత్వం. పాలకవీటి హైమా తన పిల్లలను ప్రభుత్వ స్కూల్ లో చేర్పించాలని ఎంత ప్రయత్నించినా విద్వాన్ స్కూల్ కరెస్పాండెంట్ టీ సీ లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని హైమా ఆవేదన వ్యక్తం చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం తన భర్త ను కోల్పోయి పుట్టెడు దుఃఖం లో వున్నానని, తన పిల్లలకు కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం ఉంటుందని ప్రభుత్వ స్కూల్ లో చేర్పించి చదివించాలని, తన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, కూలి చేసుకుని బ్రతుకుతున్నానని ఎంత ప్రాధేయ పడినా టీసీ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంటున్న మహిళ. 

ఇప్పటికైనా ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకుంటున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post