ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గిద్దలూరు శాసనసభ్యులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు 3రోజుల కిందట కాలేజీ విద్యార్థులు పోసుపల్లె నుండి బస్సు కావాలని గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారిని కలిసి విన్నవించుకున్నారు.
అయన వెనువెంటనే స్పందించిన ఎమ్మెల్యే డిఎం గారికి విషయాన్ని వివరించి మూడు రోజులలో పోసుపల్లెకు బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు వెంటనే మూడు రోజులలో అంటే ఈరోజు విద్యార్థుల కొరకు పోసు పల్లెకు బస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులందరూ మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
