కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఇంటింటికి ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రి శాసనసభ్యులు.





 కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఇంటింటికి ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రి శాసనసభ్యులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డు రాజానగర్ కౌన్సిలర్ శ్రీ బూనబోయిన చంద్రశేఖర్ వార్డులో బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, జౌళి & వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కలిసి "కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గారికి స్థానిక మహిళలు సాదర స్వాగతం పలుకుతూ హారతి ఇచ్చి శాలువా , పూల మాలతో ఘనంగా సన్మానించారు మంత్రి వర్యులు ఎస్ సవిత మరియు ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికీ చేరేలా అవగాహన కల్పిస్తూ, ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. గత ప్రభుత్వంలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుపుతూ మరోసారి అలాటి మాయ మాటలకు లోబడకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుభిక్షంగా ఉండాలని అందుకు మీరు అందరూ సమిష్టిగా కృషి చేసి శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి లో ముందుకు సాగాలని అన్నారు

అలాగే ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post