పి. వి.మురళీమోహన్ 54వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.



 పి. వి.మురళీమోహన్ 54వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కంభం: స్థానిక ఎస్.ఎస్.ఏ. యూపీ(పుల్లయ్య సార్ )స్కూల్, ఎన్.ఎన్.లో ఎస్.జి.టి.గా విధులు నిర్వహిస్తున్న పి.వి. మురళీమోహన్ తన 54వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈసీ కందులాపురం పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పలకలు, నోట్‌బుక్స్, అద్దాలు, దువ్వెనలు, వాటర్ క్యాన్లను అందజేసి విద్యార్థుల పట్ల తన సేవాభావాన్ని చాటుకున్నారు. పుట్టినరోజును ఆడంబరాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు తోట కోటేశ్వరరావు , భాస్కర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పి.వి. మురళీ మోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని వారు పేర్కొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post