దివ్యాంగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జూలై 21న భారీ దివ్యాంగజన్ జాబ్ మేళా కలెక్టర్.


 దివ్యాంగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జూలై 21న భారీ దివ్యాంగజన్ జాబ్ మేళా కలెక్టర్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆధ్వర్యంలో దివ్యాంగజన్ జాబ్ మేళాను 2026 జూలై 21వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మార్కాపురంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత తెలిపారు. 

ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ మరియు అంతకంటే పై అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఉద్యోగాల ప్రకారం నెలకు రూ.12,000 నుంచి రూ.32,000 వరకు వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు బెంగళూరు, చెన్నై, హోసూరు, మైసూరు, తిరుపతి, శ్రీ సిటీ తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ జాబ్ మేళాలో చెవిటి (Deaf), మూగ-చెవిటి (Deaf & Dumb), స్వల్ప లోకోమోటర్ (Mild Locomotor) మరియు లోకోమోటర్ దివ్యాంగులకు అనువైన ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి. మొత్తం 330 దివ్యాంగుల ఖాళీలు మరియు 130 సాధారణ అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 7013950097, 8008822821, 9912438757 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post