జులై 11న జాతీయ లోక్ అదాలత్.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, జూలై 04: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఈ నెల 11వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి, శనివారం జిల్లా కోర్టు భవనం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో తెలియచేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 10003 రాజీ యోగ్యమైన కేసులుగా గుర్తించడం జరిగిందని, ఈ కేసులలో మధ్యవర్తిత్వం నిర్వహించి కేసులు పరిష్కారానికి కృషిచేస్తున్నామని అన్నారు. నోటీసులు అందని కక్షిదారులు తమ పరిధిలోని కోర్టులను సంప్రదించి కేసులు పరిష్కారానికి కృషిచేయాలని, ప్రస్తుతం కోర్టులలో కేసులు పేరుకు పోయాయని వాటిని పరిష్కరించ టానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కావున కక్షి దారులు సానుకూల, స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కారానికి కృషిచేయాలని అన్నారు. తద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. కావున కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం కేసులు నుండి విముక్తి పొందాలని సూచించారు. మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ నందు 9530 కేసులను రాజీ చేసినట్లుగా తెలియజేశారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ప్రత్యక్షంగా పాల్గొనటానికి అవకాశం లేనివారు ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని, కేసులు పరిష్కారంలో సమస్యలు ఉన్నను 08812 224555 లేదా 15100 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో పర్మినెంటు లోక్ అదాలత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎ.మేరీ గ్రేస్ కుమారి, తదితరులు పాల్గొన్నారు. .
