ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో పోలీసుల సమావేశం.


 ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో పోలీసుల సమావేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు..

మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే వివాదాస్పద చిత్రాలు, వ్యాఖ్యలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రించవద్దని సూచించారు.

అదేవిధంగా, ముద్రణకు ముందు ప్రతి ఫ్లెక్స్‌లోని విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించి, చట్టానికి విరుద్ధమైన లేదా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్లయితే వాటిని ముద్రించకూడదని స్పష్టం చేశారు. 

జిల్లా ఎస్పీ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని

 ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులయజమానులకు కంభం సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి సూచించారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post