చోడవరం పోలీస్లు ఆధ్వర్యంలో అభయ కార్యక్రమం మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం- ఎస్సై నాగ కార్తీక్.
క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై:17
అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు సీఐ అప్పలరాజు సూచనలుతో చోడవరం పోలీసుల ఎస్సైలు నాగ కార్తీక్. జోగారావు ఆధ్వర్యంలో "అభయ" కార్యక్రమంలో భాగంగా చోడవరం మండలంలోని లక్ష్మిపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలు, బాలికల భద్రత మరియు వారికి సంబంధించిన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చోడవరం ఎస్‌ఐ బి. నాగకార్తీక్ సుమారు 300 మంది విద్యార్థులకు మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్),యాసిడ్ దాడులు (ఆసిడ్ అటాక్స్), కిడ్నాప్ మరియు అపహరణ (కిడ్నాపింగ్ & అబ్దుక్షన్),పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు (వర్కప్లేస్ హరస్మెంట్), బాల్య వివాహాలు (చైల్డ్ మ్యారేజస్), బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు (పబ్లిక్ హరస్మెంట్), ఏఐ మరియు డిజిటల్ నేరాలు (ఎఐ& డిజిటల్ క్రైమ్స్), గృహ హింస (డోమెస్టిక్ వైలెన్స్)తో పాటు మహిళలపై జరిగే నేరాలు, సైబర్ భద్రత మరియు సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ సేవలు మరియు మహిళల సహాయం కోసం 181 మహిళా హెల్ప్‌లైన్ను వినియోగించుకోవాలని సూచించారు.ఎల్లప్పుడూ ప్రతి మహిళలకు చోడవరం పోలీస్ లు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య వచ్చిన ట్రోల్ ఫ్రీ నెంబర్ కు కానీ నేరుగా స్టేషన్ కు వచ్చి నిర్భయంగా పిర్యాదు చేయొచని ఎస్సై నాగ కార్తీక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
