సిబ్బంది సంక్షేమమే మా ధ్యేయం: విజయవంతంగా ‘SP-SAMPARK’.
ఫిర్యాదులపై తక్షణ ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, జూలై 17:
అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన ‘SP-SAMPARK’ ఫోన్-ఇన్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,స్వయంగా ఫోన్ లైన్ ద్వారా సిబ్బంది సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.
ఉన్నతాధికారులకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య దూరాన్ని తగ్గించి, సిబ్బంది తమ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఇబ్బందులను ఎటువంటి సంకోచం లేకుండా నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చేలా ఈ సరికొత్త వేదికను రూపొందించారు.
జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది 93469 12011 నంబర్ ద్వారా నేరుగా ఎస్పీ గారితో మాట్లాడి తమ సమస్యలను వివరించారు.
ప్రధాన సమస్యలు సిబ్బంది ప్రధానంగా సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు మరియు కుటుంబ ఆరోగ్య సమస్యలను ఎస్పీ దృష్టికి తెచ్చారు. త్వరితగతిన పరిష్కారం ప్రతి సమస్యను లోతుగా విశ్లేషించిన ఎస్పీ, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
డిజిటల్ పర్యవేక్షణ వచ్చే ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, అది పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం జరుగుతుంది.
"పోలీస్ సిబ్బంది సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత. దూర ప్రాంతాల నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చు. ప్రతి సమస్యను పూర్తి గోప్యంగా ఉంచుతూ త్వరితగతిన పరిష్కారం చూపుతాం."
తుహిన్ సిన్హా , జిల్లా ఎస్పీ.
సిబ్బంది సమాచారం కొరకు
ఈ ‘SP-SAMPARK’ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
