స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: వజ్జ బాబురావు.



 స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: వజ్జ బాబురావు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాలలో క్రీడా దుస్తులు, షూస్ పంపిణీ.

పలాస, జూలై 18 : స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు పిలుపునిచ్చారు.

పలాస పట్టణంలోని శివాజీనగర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించిన వజ్జ బాబురావు విద్యార్థినులతో మమేకమై వారి విద్యాభ్యాసం, క్రీడలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే విద్యలోనూ, జీవితంలోనూ విజయాలు సాధించవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న క్రీడా దుస్తులు (స్పోర్ట్స్ యూనిఫాంలు), షూస్ను విద్యార్థినులకు పంపిణీ చేశారు. విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థినులకు సూచించారు.

తదుపరి పాఠశాల ఆవరణ, మౌలిక వసతులను పరిశీలించిన వజ్జ బాబురావు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, క్రీడలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా భావి తరాలను సమర్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post